యుపిలో శనివారం ‘నో స్కూల్ బ్యాగ్ డే’

Published : May 13, 2017, 07:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
యుపిలో శనివారం ‘నో స్కూల్ బ్యాగ్ డే’

సారాంశం

ఉత్తర ప్రదేశ్ లో శనివారం పిల్లలు  స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ ఆయాస పడుతూ స్కూళ్లకు రానవసరం లేదు.బ్యాగ్, పుస్తకాలు అలమరల్లో పడేసి అడుకునేందుకు పాడుకునేందుకు మాత్రమే స్కూలు కు రావాలి. ప్రభుత్వ పాఠశాలలో శనివారాన్ని ‘నో స్కూల్ బ్యాగ్ డే ’పాటించాలని  ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం  నిర్ణయించింది.

ఉత్తర ప్రదేశ్ లో శనివారం పిల్లలు  స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ ఆయాస పడుతూ స్కూళ్లకు రానవసరం లేదు.బ్యాగ్, పుస్తకాలు అలమరల్లో పడేసి అడుకునేందుకు పాడుకునేందుకు మాత్రమే స్కూలు కు రావాలి. ఇది నియమం.

 

ప్రభుత్వ పాఠశాలలో శనివారాన్ని ‘నో స్కూల్ బ్యాగ్ డే ’పాటించాలని  ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం  నిర్ణయించింది.

 

ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అధ్యక్షతన  జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం మీద తుది నిర్ణయం తీసుకున్నారు.

 

ఆరోజు విద్యార్థులెవరూ బ్యాగులు  మోసుకుంటూ రానవసరం లేదు. అంటే పుస్తకాలుండవు. పాఠాలుండవు, హోం వర్క్ ఉండదు.  శనివారం పూర్తిగా సృజనాత్మక కార్యకలాపాలతో విద్యార్థులు నిమగ్నం కావాలని ప్రభుత్వం ప్రకటించింది.దీనివల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయుకు గురు-శిష్య బంధంబలపడుతుందని, తద్వార విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని యోగి అదిత్యనాథ్  భావిస్తున్నారు.

 

ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలో వాడుతూ వచ్చిన ఖాకి డ్రెస్ ను కూడా ప్రభుత్వం నిషేధించింది.

 

జూలైప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు బ్రౌన్ ట్రౌజర్, బ్రైన్ పింక్ కాలర్, గీతల చొక్కాలను ధరిస్తారు.అమ్మాయిలు ఇదేచొక్కా,  బ్రౌన్ స్కర్ట్ ధరించాలి.సీనియర్  లయితే బ్రౌన్ సల్వార్, రెడ్ కుర్తా, బ్రౌన్ దుపట్టా ధరించాలి.

 

విద్యార్థులు ధరిస్తున్న ఖాకి యూనిఫాం వల్ల వాళ్లు హోం గార్డుల్లా కనపడుతున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించాక అధికారులు యూనిఫాం మార్చేశారు.

 ఎన్నికల  హామీ ప్రకారం జూలై నుంచి విద్యార్థలందరికి ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, షూ, స్కూల్ బ్యాగ్ అందిస్తాంరు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !