టిటిడికి ఉత్తరాది ఐఎఎస్ నియామకం : పవన్ అసంతృప్తి

First Published May 8, 2017, 6:11 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తరాది ఐఎఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా  నియమించడం మీద రేగిన వివాదానికి జనసేన నేత పవన్ కూడా గొంతు కలిపారు.ఇప్పటికే ఈ విషయం మీద విశాఖ చెందిన స్వామి స్వరూపానంద అగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కోర్టు కీడుస్తానని కూడా స్వామి వారు శెలవిచ్చారు. ఇపుడు పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ లోనుంచి తనదైన శైలిలో స్పందించారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తరాది ఐఎఎస్ అధికారి ఎకె సింఘల్ ని కార్యనిర్వహణాధికారిగా  నియమించడం మీద రేగుతున్న వివాదానికి జనసేన నేత పవన్ కూడా గొంతు కలిపారు.

 

ఇప్పటికే ఈ విషయం మీద విశాఖ చెందిన స్వామి స్వరూపానంద అగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కోర్టు కీడుస్తానని కూడా స్వామి వారు శెలవిచ్చారు. ఇపుడు పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ లోనుంచి తనదైన శైలిలో స్పందించారు.

ఆయన ఏమంటున్నారంటే...

టిటిడి బోర్డుకు ఉత్తర భారదేశానికి చెందిన ఐఎఎస్ అధికారి ని కార్యనిర్వహణాధికారిగా నియమించడానికి నేను వ్యతిరేకం కాదు.కాని,  ఉత్తర భారతదేశంలో ఉన్న అమరనాథ్,వారణాసి, మధుర  తదితర పవిత్ర క్షేత్రాల పాలనా బాధ్యతలను దక్షిణాది అధికారులకు అప్పగిస్తారా? అలాంటి క్షేత్రాలకు దక్షిణ భారతీయులను పాలనాధికారులుగా నియమంచలేనపుడు, దక్షిణాది వారెందుకు ఉత్తారాదివారిని అంగీకరించాలి? టిడిపీ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని అనుమతించడం నాకు అశ్చర్యంగా ఉంది. అంధ్ర ప్రజలకే కాదు, మొత్తం దక్షిణాది ప్రజలకు వారు  సంజాయిషీ ఇవ్వాలి.

 

 

 

pic.twitter.com/9ohFTEuF3p

— Pawan Kalyan (@PawanKalyan) 8 May 2017
click me!