రెండు వేల నోటుకు అప్పుడే నూరేళ్లు !

First Published Dec 12, 2016, 12:57 PM IST
Highlights
  • రూ. 2 వేల నోటు రద్దవుతుందంటున్న ఆర్ ఎస్ ఎస్

 

పెద్ద నోట్ల రద్దు పై బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ కూడా మొదటి నుంచి వ్యతిరకంగానే ఉంది. ఇప్పుడైతే మోదీ ప్రభుత్వం తెచ్చిన రూ. 2 వేల కొత్త నోటు కూడా త్వరలోనే రద్దు అవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి తేల్చిచెప్పారు.

 

ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతకర్తనే అలా చెప్పాడంటే ఇంకే ముంది.. ఆర్ బి ఐ చెప్పినట్లే అని అనుకోవచ్చు అనుకుంటా.

 

రానున్న ఐదేళ్లలో ఈ రూ. 2 వేల నోటు ఎప్పుడైనా రద్దు కావొచ్చని గురుమూర్తి జోస్యం చెప్పారు. రద్దు చేసేందుకు రూ. 2 వేల నోటును తీసుకొచ్చారని అన్నారు.

 

అయితే రూ. 2 వేల నోటు రద్దుపై పలు మీడియా సంస్థలు ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించాయి.

 

click me!