atm = ఎనీ టైం మర్డర్

First Published Dec 12, 2016, 11:37 AM IST
Highlights
  • ఏటీఎం సెంటర్ల వద్ద ’నోటు‘ పాట్లు
  • క్యూ లైన్ లో లాఠీచార్జీలు, మరణాలు
  • డబ్బులు దొరక్క ఆగ్రా లో మాజీ సైనికుడి ఆత్మహత్య

పెద్ద నోట్ల రద్దు నిండుప్రాణాలను బలిగొంటున్నాయి. ఇన్నాళ్లు ఏటీఎం క్యూలో నిలబడి గాయపడిన వారు, చనిపోయినవారి గురించే మనం విన్నాం.

 

కానీ, ఇదో విషాదకర సంఘటన.. ఏటీఎం క్యూలో నిలబడి డబ్బులు దొరక్కపోవడంతో విసిగిపోయి ఓ మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కు చెందిన రాకేశ్ యాదవ్(54) సీఆర్ పీ ఎఫ్ లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమై ఏటీఎం సెంటర్ కు వెళ్లారు.


అయితే అప్పటికే ఏటీఎంలో డబ్బులు అయిపోయాయి. దీంతో తీవ్ర నిరాశ చెందిన రాకేశ్ యాదవ్ తన రివాల్వర్ తో అక్కడే కాల్చుకున్నాడు.  ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

 

కాగా, 1990 లో కశ్మీర్ లోని బారా ముల్లా లో తీవ్రవాదులు జరిపిన దాడిలో రాకేశ్ యాదవ్ శరీరంలోకి ఐదు బుల్లెట్ లు దిగాయి.  అయినా కూడా ఆయన రిటైర్డ్ అయ్యేవరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేశారు.

 

పాపం... తీవ్రవాదుల బుల్లెట్ లు కూడా తీయలేని ప్రాణాన్ని ఒక్క ఏటీఎం తీసేసింది.  

click me!