జాతీయ వార్తల్లో మళ్లీ రెండు తెలుగు పేర్లు

First Published Jun 28, 2017, 12:38 PM IST
Highlights

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక జరుగుతుంది. ఇపుడున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ  వచ్చే నెల రిటైరవుతున్నారు.రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక పూర్తయి నామినేషన్లు కూడా వేశారు కాబట్టి, ఇపుడు దృష్టంతా వచ్చే ఉప రాష్ట్రపతి ఎవరూ అనేదాని మీదకు మళ్లింది.దీనితో మళ్లీ రెండు తెలుగుపేర్లు వార్తల్లోకొచ్చాయి.

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక జరుగుతుంది. ఇపుడున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ  వచ్చే నెల రిటైరవుతున్నారు.రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక పూర్తయి నామినేషన్లు కూడా వేశారు కాబట్టి, ఇపుడు దృష్టంతా వచ్చే ఉప రాష్ట్రపతి ఎవరూ అనేదాని మీదకు మళ్లింది.

 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఉత్తరాది వ్యక్తి కాబట్టి ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాది ఇస్తారని వాదన వినిపిస్తూ ఉంది. దీనితో మళ్లీ రెండు తెలుగుపేర్లు వార్తల్లోకొచ్చాయి. ఇందులో ఒకటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడి పేరు కాగా, రెండో పేరు మహారాష్ట్రగవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుది. ఆయన తమిళనాడుకు కూడా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. ఇక వెంకయ్యనాయుడు పేరు తెలుగువాడే అయినా, ఆయన ఎక్కువ పార్లమెంటులో కర్నాటకు ప్రాతినిధ్యం వహించారు. అందువల్ల వీరివరు దక్షినాదికి నిజమయిన ప్రతినిధులని ఒక వాదన వస్తూ ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఈ రెండుపేర్లను మిడియా బాగా చర్చల్లోకి తీసుకువచ్చింది. బిజెపి నాయకత్వం అందరి అంచనాలు తారుమారుచేస్తూ ఎపుడుూ వార్లల్లో కెక్కని రామ్ నాథ్ కోవింద్ పేరు ప్రతిపాదించింది.

 

అయితే, గవర్నర్ పదవి నుంచి ఉపరాష్ట్రపతి కావడం ప్రమోషనేమో గాని, కేంద్రమంత్రి పదవినుంచి ఉపరాష్ట్రపతి కావడం ఎవరూ ప్రమోషన్ గా భావించరు.అందునా ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో మంచిపేరున్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి  రాజకీయాలనుంచి రిటైరయిపోతారా అనేది ప్రశ్న. మొదటి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి  వెంకయ్యనాయుడు పార్టీలో, ప్రభుత్వం లో కీలకపాత్ర పోషిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. అలాకాకుండా విద్యాసాగరరావు ఒక్కసారి మాత్రం కేంద్రంలో సహయ మంత్రిగా చేసి తర్వాత కనుమరుగయ్యారు. 

 

వెంకయ్య నాయుడి అవసరం పార్టీకి , ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి  బిజెపి ఆయనను క్రియాశీల రాజకీయాలలో కొనసాగించవచ్చు. వెంకయ్య నాయుడ కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించకపోవచ్చు.

 

విద్యాసాగర్‌రావును ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే తెలంగాణలో బిజెపి కి మంచిపేరొస్తుందని పార్టీలో నాయకులు భావిస్తున్నారు. అందువల్ల విద్యాసాగరరావు కు ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన  బిజెపివర్గాలే చెబుతున్నాయి.

 

అయితే, ఇతర  ఎన్డీయ పార్టీలనుంచి  ఉప రాష్ట్రపతికి అభ్యర్థిని ఎంపిక చేసి  కూటమిని ఇంకా బలోపేతం చేసుకుంటే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీలో చర్చల్లో ఉందని  ఈ వర్గాలు చెప్పాయి.

 

click me!