సెప్టెంబరు 1న టిటిడి ఇవొ తో భక్తులు నేరుగా మాట్లాడవచ్చు

Published : Aug 30, 2017, 05:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
సెప్టెంబరు 1న టిటిడి ఇవొ తో భక్తులు నేరుగా మాట్లాడవచ్చు

సారాంశం

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన అనుమానాలను నేరుగా టిటిిడి కార్య నిర్వహణాధికారి ద్వారానే  నివృత్తి చేసుకోవచ్చు  

తిరుమల సందర్శించాలనుకునే వారికి  ఎన్నో సమస్యలెదురవుతుంటాయి. చాలా సమాచారం అవసరమవుతూ ఉంటుంది. ఏది ఎక్కడో ఉంటుందో తెలియదు. దానికి తోడు తిరుమల గురించి విజ్ఞానం పూర్తిగా అందరికి చేరలేదు. దీనికి ఒక సారి సందర్శించి వచ్చాక కొన్ని సమస్యలు ఎదురయి ఉండవచ్చు. ఫిర్యాదుచేయాలనుకుంటూ ఉండవచ్చు. ఇలాంటివాటి కోసం తిరుమతి తిరుపతి దేవస్థానం ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ ‘డయల్ యువర్ ఇవొ’ కార్యకమ్రం నిర్వహిస్తుంది. 

ఈ సారి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌కి  ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261. సెప్టెంబరు 1న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !