వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య

First Published Apr 23, 2018, 2:16 PM IST
Highlights

మృతుడి గ్రామంలో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మండల స్థాయి టీఆర్ఎస్ లీడర్ ను దుండగులు కత్తులతో వెంటపడి నరికి అత్యంత దారుణంగా హతమార్చారు. హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఈ హత్యకు రాజకీయ కారణాలేమీ లేవని, భూతగాదాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోని దారూర్ మండలం మైలారం కు చెందిన పెండ్యాల శ్రీనివాస్ మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య యాదమ్మ ధారూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉంది. రాజకీయంగా వీరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అయితే నిన్న సొంత గ్రామం మైలారంలో జరిగిన ఓ వివాహానికి శ్రీనివాస్ హాజరయ్యాడు. అనంతరం పక్క గ్రామంలో వున్న తన పొలానికి వినోద్ అనే వ్యక్తితో కలిసి బైక్ పై వెళుతుండగా దుండగులు ఇతడిపై దాడి చేశారు.

శ్రీనివాస్ కు మైలారం గ్రామారనికే చెందిన కొందరితో భూతగాదాలున్నాయి. దీంతో ప్రత్యర్థులు ఆతన్ని హతమార్చడానికి పథకం పన్నారు. అతడు పొలానికి వెళ్లే దారిలో కాపుకాసిన దుండగులు మద్దులపల్లి దాసు(37), రత్నం(36), ప్రశాంత్‌ (27), అరుణ్‌(24)లు అత్యంత దారుణంగా వెంటపడి నరికి చంపారు.  శ్రీనివాస్ తో పాటు వున్న వినోద్ ప్రాణభయంతో పారిపోయాడు. శ్రీనివాస్ ను దుండగులు మెడ, తలపై నరకడంతో అతడు అక్కడికక్కడు మృతి చెందాడు. హత్య తర్వాత నిందితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు.

ఈ హత్యతో మైలారం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. మృతుడు శ్రీనివాస్ బందువులు నిందితుల ఇళ్లను ద్వంసం చేశారు. దీంతో పోలీసుగు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా చూసుకుంటున్నారు.

click me!