హైదరాబాద్ మెట్రో టికెట్ గరిష్ట చార్జి రు. 50 మాత్రమే?

First Published Oct 13, 2017, 12:22 PM IST
Highlights

హైదరాబాద్ మెట్రో చార్జీలు భారంగా కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచన

హైదరాబాద్ మెట్రో చార్జీల ప్రయాణికుల మీద భారం కాకపోవచ్చు. ఢిల్లీలో ఈ మధ్య మెట్రో చార్జీలను భారీ పెంచడంతో  మెట్రో రైళ్లు సిద్ధమవుతున్న అన్ని నగరాలలో  చార్జీల గురించి ప్రజలు ఆందోళనచెందుతున్నారు. ఢిల్లీలో క్యాబ్ ఆపరేటర్లకు మేలు చేసేందుకు మెట్రో చార్జీలను పెంచారనే తీవ్రమయిన ఆరోపణ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కోసం వేచివున్న వారికి ప భుత్వం   గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతున్నది. మెట్రోను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం భాగ్యనగర వాసులకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వనుంది. ఇతర నగరాలతో పోలిస్తే మెట్రో చార్జీలు చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది అధికారులు వెల్లడించారు. ముంబైలో మెట్రో టికెట్ గరిష్ఠ చార్జి రూ.110, చెన్నైలో రూ.70, ఉండగా ఢిల్లీ, బెంగళూరులో రూ.60 వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో  2 కిమీ రు. 10, 2 నుంచి 5 కిమీ రు 20, 5 నుంచి 12 కిమీ రు 30, 12 నుంచి21 కిమీ రు.40, 21 నుంచి 32 కిమీ రు50, 32 కి మీ పై ప్రయాణానికి  రు.60 చేస్తూ మూడు రోజుల కిందట కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే.. అయితే ఇతర నగరాల కంటే తక్కువగా గరిష్ఠ చార్జిని కేవలం రూ.50కే ఖరారు చేసి, సేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే నష్టాలను పూడ్చుకునేందుకు ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ-హెచ్ఎంఆర్ఎల్‌లకు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో రియాల్టీ ప్రాజెక్టుల కోసం 269 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

click me!