ఎవరు పనిచేసినా కార్పొరేట్ల కోసమే

First Published Dec 25, 2016, 4:26 AM IST
Highlights

ముఖేష్ అంబానీ, అదానీ, బిర్లా, టాట, విజయామాల్యా ఇలా..కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖులందరికీ ఇటు ఎన్ డిఏ అయినా అటు యూపిఏ అయినా సన్నిహితమే.

వీళ్ళు దొంగలని వాళ్లు..కాదు వాళ్లే దొంగలని వీళ్లు..మొత్తానికి అందరూ దొంగలేనని జనాలు...ఇందులో ఏది కరెక్ట్ అంటే జనాల మాటే కరెక్టని అనక తప్పదు. ఎందుకంటే, అధికారంలో ఎవరున్నా అందరూ పనిచేసేది కార్పోరేట్ ప్రపంచం కోసమే అన్న విషయం స్పష్టమవుతున్నది.

 

ముఖేష్ అంబానీ, అదానీ, బిర్లా, టాట, విజయామాల్యా ఇలా..కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖులందరికీ ఇటు ఎన్ డిఏ అయినా అటు యూపిఏ అయినా సన్నిహితమే.

 

 

ఎవరు అధికారంలో ఉన్నా వేల కోట్ల రుణాలు మాఫీ అవటం  మాత్రం ఖాయం. అదే సామాన్యుడికి రూ. 10 వేలు అప్పు కావాలన్నా, బకాయిపడినా గోళ్ళూడగొట్టి వసూలు  చేస్తారు. రుణాలు ఎవరికైనా రద్దు చేయాలంటే యోచించాల్సింది రైతుల గురించే.

అసలు మాఫీ చేయాల్సిన అన్నదాతల రుణాలను మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. బ్యాంకుల్లో అప్పులు పుట్టక,  ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద చేసిన అప్పులు తీరక దేశానికే అన్నంపెడుతున్న వేలాదిమంది అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వారి ఘోష మాత్రం ఎవరికీ పట్టటం లేదు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని కార్పొరేట్ సంస్ధల లక్షల కోట్ల బకాయిలను ఎన్డిఏ రద్దు చేసిందని  మోడి భజన బృందం, కాదు మన్మోహన్ సింగ్ సర్కారే రద్దు చేసిందని కమలనాధులు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు తీరిగ్గా. అంటే దాని అర్ధమేమిటి? ప్రభుత్వంలో ఎవరున్నా లక్షల కోట్ల రుణాలు రద్దయ్యేది మాత్రం కార్పొరేట్ సంస్ధలకేనని స్పష్టమవటం లేదా?

click me!