
స్వచ్చ-భారత్ ను స్వచ్చంగా చూశారా ఎపుడయినా?
ఒక చిన్న పాయింట్ ను తీసుకుని
కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా
మంచి సందేశంతొ సినిమా తీస్తే
"టాయిలెట్-ఏక్ ప్రేం కథా" లా ఉంటుంది.
ఇందులో వందల మందిని నరకటాల్లేవు,
సుమోలు ఎగరటాల్లేవు, గెంతులేసే పాటల్లేవు.
పంచ్ డైలాగుల్లేవు. మరేం ఉన్నాయ్?
సాదా సీదా జీవితాలున్నాయ్, అందులో
ఒక ప్రేమ కథుంది.. సందేశముంది..
అక్షయ్ కుమార్ లాంటి హీరో కు మాత్రమే
ఈ సినిమా చేసె ధైర్యముంది..
సినిమాను బోర్ కొట్టకుండా తీయగలిగిన
స్క్రిప్ట్ ఉంది.. వెరసి చూడగలిగే సినిమా అయ్యింది!
పీ.ఎస్: నేను సినిమా కు రెడీ అవుతుంటే
ఎవరో ఫోన్ చేశారు.. నేను "మళ్ళీ చేస్తాను..ఆటో రెడీ గా ఉంది
టాయిలేట్ కు వెళ్తున్నానని చెప్పగానే.. అవతల్నుంచి "ఏంటీ అన్న కేక!