ఈ రోజు మీ రాశిఫలాలు..

Published : Dec 07, 2017, 12:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఈ రోజు మీ రాశిఫలాలు..

సారాంశం

ఈ రోజు మీ రాశిఫలాలు..

1. మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉద ర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

2. వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీ లు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

3. మిథునం

మిథునం : చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.

4. కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త విం టారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

5. సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశ ముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి

6. కన్య

కన్య : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉం టుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు .

7. తుల

తుల : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయి దా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

8. వృశ్చికం

వృశ్చికం : ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరో గ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబం ధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలి సి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

9. ధనుస్సు

ధనుస్సు : మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. గృహ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

10. మకరం

మకరం : మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది.సంతానం కారణంగా ఆనం దం పొందుతారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తా యి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

11. కుంభం

కుంభం : మీ వృత్తిలో శుభపరిణామాలు ఏర్పడతాయి. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో గెలుపొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తలనొప్పి లేదా మెడ నొప్పులు మిమ్మల్ని బాధించవచ్చు.

12. మీనం

మీనం : ఈ రోజు అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu