28 మార్చి 2018 బుధవారం మీ రాశిఫలాలు

Published : Mar 28, 2018, 09:05 AM IST
28 మార్చి 2018 బుధవారం మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది

 

మేషం

మేషం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీపై మీకున్న నమ్మకాన్ని కోల్పోకుండా చేసే పని మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మీ సహనాన్ని, పట్టుదలను కోల్పోకండి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.

వృషభం

వృషభం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చ. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

సింహం

సింహం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్‌లో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

కన్య

కన్య :మీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు.

తుల

తుల : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి, చేపట్టడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపార లావాదేవీల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభం

కుంభం : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యకమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల మార్పులు ఉంటాయి.

మీనం

మీనం : ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిలో అనుకోని మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేపట్టిన పనులు చిన్నపాటి ఆటంకాలతో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu