షియోమి నుంచి హైఎండ్ స్మార్ట్ ఫోన్

Published : Mar 27, 2018, 06:49 PM IST
షియోమి నుంచి హైఎండ్ స్మార్ట్ ఫోన్

సారాంశం

ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ  షియోమి.. హైఎండ్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఎంఐ మిక్స్‌ 2ఎస్ పేరుతో  స్మార్ట్‌ఫోన్‌ను  చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.   బెజెల్‌ లెస్‌​ స్క్రీన్‌తో  ఈ వైస్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది.   8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌, 6 జీబీ/128 స్టోరేజ్‌,  6 జీబీ/64 స్టోరేజ్‌ వెర్షన్‌లను అందుబాటులో ఉంచింది.  చైనాలో  8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్‌ వేరియంట్‌  ధర సుమారు  రూ. 37,000, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ, వైర్‌లెస్‌ చార్జర్‌, ఫింగర్‌ ప్రింట్‌  రీడర్‌ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. దీంతోపాటు ఎంఐ  గేమింగ్‌ ల్యాప్‌టాప్‌, ఎంఐ స్పీకర్‌ మినీని లాంచ్‌ చేసింది. త్వరలోనే దీనిని భారత మార్కెట్లో కూడా విడుదల చేయనుంది.

ఎంఐ మిక్స్ 2ఎస్ ఫోన్ ఫీచర్లు...

5.9 బెజెల్‌ లెస్‌ స్క్రీన్‌
స్నాప్‌ డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
2160×1080 ఫుల్‌ హెచ్‌డీ  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
 12+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu