15 జూన్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

Published : Jun 15, 2018, 09:49 AM IST
15 జూన్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

సారాంశం

అనుకోని బహుమతి అందించే అవకాశముంది.

మేషం

మేషం: ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటి వారిని ఇబ్బంది కల్గించే అవకాశముంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగం లో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. నివాస స్థలంలో మార్పు ఉంటుంది. పిల్లల గురించి శుభవార్త వింటారు.

సింహం

సింహం: ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవస రం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూ సుకోండి. సహోద్యోగుల సహకారం అందుకుంటారు.

కన్య

కన్య : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహా యం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

తుల

తుల : మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు: మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.

మకరం

మకరం : మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. స్నేహితులతో కలిసి వినోదయాత్ర చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహాయం అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలం గా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార సంబంధ పెట్టుబడులు కానీ, ఒప్పందాలు కానీ చేస్తారు.

కుంభం

కుంభం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నీటి కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశముంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ తగినంత డబ్బు సమయానికి అందుతుంది. సహోద్యోగుల సహకారం అందుకుంటారు.

మీనం

మీనం : ఈ రోజు చేపట్టిన పనులు అధిక శ్రమతో పూర్తి చేయగలుగుతారు. సాయం చేస్తా అని చెప్పిన వారు సమయానికి మాట మార్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu