14 జూన్ 2018 గురువారం మీ రాశిఫలాలు

Published : Jun 14, 2018, 09:53 AM IST
14 జూన్ 2018 గురువారం మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. అనవసర ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభం

ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలమిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

మిథునం

పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. వాయిదాలు వేయకుండా అనుకున్న పనులు పూర్తి చేయటం మంచిది.

కర్కాటకం

ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. విదేశీసంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.

సింహం

ఈ రోజు స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కన్య

ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతా రు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి. మీకు తగని పనుల జోలికి వెళ్లకండి. దాని కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

తుల

మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మా ర్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతా రు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. పిల్లలతో గడపటం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది.

వృశ్చికం

ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతీలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

ధనుస్సు

మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మకరం

ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీ కు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. పిల్లలతో గడపటం వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది.

కుంభం

స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయం. మీ జీవిత భాగస్వామి నుంచి సా యం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలమైన రోజు కాదు.

 

 

మీనం

ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. వాయిదాలు వేయకుండా అనుకున్న పనులు పూర్తి చేయటం మంచిది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu