1 జూన్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

Published : Jun 01, 2018, 09:26 AM IST
1 జూన్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

సారాంశం

ఉత్సాహంగా ఉంటారు.

మేషం

మేషం: ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ సంతానం కారణంగా ఆనందాన్ని పొందుతారు. వివాహ సంబంధ విషయాలు కొలిక్కి వస్తాయి.

వృషభం

వృషభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్ కు అనుకూల దినం ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లి తరఫు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

కన్య

కన్య : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

తుల

తుల : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కాని, స్నేహితులను కాని కలుసుకుంటారు.

మకరం

మకరం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులొస్తాయి. పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

కుంభం

కుంభం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.

మీనం

మీనం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకునే వారికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలిగి పోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్త్రీల విషయంలో కల్పించుకోకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu