11 జూన్ సోమవారం 2018..మీ రాశిఫలాలు

Published : Jun 11, 2018, 08:28 AM IST
11 జూన్ సోమవారం 2018..మీ రాశిఫలాలు

సారాంశం

ఉద్యోగంలో ప్రమోషన్ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీ వింటారు.

మేషం

మేషం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగులు లేదా పైఅధికారుల ప్రశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీ వింటారు.

వృషభం

వృషభం : ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కళ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం బారిన పడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వలన అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏ నిర్ణయమైనాఆలోచించి తీసుకోవడం మంచిది.

 

మిథునం

మిథునం : చాలా ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకోవడం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. అలాగే పాత మిత్రులను కలవడం జరుగుతుంది. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి అనువైన రోజు. బహుమతులు అందుకుంటారు. మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది.

కర్కాటకం

కర్కాటకం : అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు.

సింహం

సింహం : ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆహారం కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది.

కన్య

కన్య : సహోద్యోగులు, పై అధికారులతో సుహృద్భావంతో మెలగండి. వారితో గొడవలకు దిగడం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవటంతో అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

తుల

తుల : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపార ఒప్పందాలు పూర్తి చేయడం కానీ, నూతన వ్యాపారం ఆరంభించటం కానీ చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. విదేశీ యానానికి సంబంధించి, పెట్టుబడికి సంబంధించి కానీ ఒక శుభవార్త వింటారు.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. సంతానం వృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా ఆనందం పొందుతారు.

మకరం

మకరం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు.

మీనం

మీనం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాలి. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu