09 జూన్ శనివారం 2018..మీ రాశిఫలాలు

Published : Jun 09, 2018, 09:24 AM IST
09 జూన్ శనివారం 2018..మీ రాశిఫలాలు

సారాంశం

మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. 

మేషం

మేషం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

వృషభం

వృషభం : ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.

మిథునం

మిథునం : ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటుచేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పైఅధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటకం

కర్కాటకం : పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కన్య

కన్య : స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోద యాత్ర చేస్తారు.

తుల

తుల : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి.

వృశ్చికం

వృశ్చికం : మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గడపటం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

ధనుస్సు

ధనుస్సు : ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

మకరం : మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం

కుంభం : ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దాని వలన మీ ప్రతిష్టకు భంగం కలుగకుండా ఉంటుంది.

మీనం

మీనం : స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu