ఫిబ్రవరి 1 గురువారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 01, 2018, 07:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఫిబ్రవరి 1 గురువారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం : ఈ రోజు మీ ఆర్థిక సమస్యలు తొలగటానికి అవసరమైన డబ్బు అందటం కాని, ఆ విషయంలో మీరు చేస్తున్న పయత్నాలు విజయవంతం అవటం కానీ జరుగుతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయాన్ని అందుకుంటారు.

మిథునం

మిథునం : చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక పయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు దూర పదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి పశంసలు అందుకుంటారు. పయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని పయాణం చేయకండి.

కన్య

కన్య : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మితృలను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల

తుల : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ పతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

వృశ్చికం : పయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిదలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మితృలతో కలిసి ఆధ్యాత్మిక క్షేత దర్శనం చేసే అవకాశముంటుంది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా పవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. పయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

మకరం

మకరం : వైవాహిక జీవితంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితభాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతి కాని, అనుకూల మార్పు కాని చేటు చేసుకుంటుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారం పారంభిస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

కుంభం

కుంభం : ఈ రోజు వృత్తి విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి కొరకు లేదా నూతన ఉద్యోగం కొరకు పయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల సహకారం అందుకుంటారు. చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు, సృజనాత్మతకతకు గుర్తింపు లభిస్తుంది. మీ సంతానంకు సంబంధించి ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో పమోషను లేదా అనుకూల మార్పు చోటుచేసుకుంటుంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu