ఫిబ్రవరి 27 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

Published : Feb 27, 2018, 08:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఫిబ్రవరి 27 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు మీ బంధువులను లేదా పరిచయస్థులను కలవటానికి వెళ్తారు. వివాహం లేదా ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు లేదా వాటికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు అత్యుత్సహాన్ని ప్రదర్శించడం చేయవద్దు.

వృషభం

వృషభం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిథునం

మిథునం : ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహపూర్వకంగా మెలగడం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి.

సింహం

సింహం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.శివారాధన మేలు చేస్తుంది.

కన్య

కన్య : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అకాశముంంది.

తుల

తుల : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.మీ ఆలోచన, సృజనాత్మతకతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావాల్సిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చాల్సిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. పై అధికారులను కలిసేందుకు అనుకూల దినం.

మకరం

మకరం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

కుంభం

కుంభం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

మీనం

మీనం : : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu