ఫిబ్రవరి 25, 2018 ఆదివారం మీ రాశి ఫలాలు

Published : Feb 25, 2018, 08:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఫిబ్రవరి 25, 2018 ఆదివారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం: ఈ రోజు ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేసే అవకాశముంది. ఆవేశానికి లోనై తొందరపాటు నిర్ణయా లు తీసుకోకండి. దాని కారణంగా తర్వాత బాధ పడాల్సి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు.

వృషభం

వృషభం: ఈ రోజు ఆర్థికంగా అనుకూలించే దినం. రావలసిన డబ్బులు వస్తాయి, పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వివాదాలు సమసి పోతాయి. వృత్తిలో అనుకూల మారు్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం

మిథునం : ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ప్రతి పనిలో, ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులు ఎదుర్కొంటారు. గొడవ, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. పెట్ట్టుబడులకు అనుకూలం. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహం

సింహం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

కన్య

కన్య : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

తుల

తుల :ఈ రోజు మీరు అనుకున్న ప్రయాణ సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీంతో మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్య ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం మీ ఆందోళనకు కారణమవుతుంది. కానీ, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంది.ఉద్యోగంలో అనుకోని మారు్పులు జరగవచ్చు.

కుంభం

కుంభం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

మీనం

మీనం :ఈ రోజు ఆర్థికం సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు గానీ చేయవలసి వస్త్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu