ఫిబ్రవరి 20, 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

Published : Feb 20, 2018, 08:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఫిబ్రవరి 20, 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : కంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మా నసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకోకుండా చివరి నిమిషంలో వాయిదా పడటం వలన చికాకుకు, ఆందోళనకు గురి అవుతారు.

వృషభం

వృషభం :ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. సమయానికి డబ్బు అందటం వలన ఆర్థిక సమస్య తొలగి పోతుంది.

మిథునం

మిథునం :అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త విం టారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలా గే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు. శివారాధన చేయటం మంచిది.

కర్కాటకం

కర్కాటకం : ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మీ సంతానం గు రించి కానీ, ఏదైనా పోటీ విషయంగా కానీ డబ్బు ఖర్చవుతుంది.

సింహం

సింహం : ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదా లు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య

కన్య :ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. విలాసాల కొరకు ఖర్చు అధికంగా చేస్తారు. పెట్టుబడులకు, నూ తన ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

తుల

తుల :అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రా రంభించటానికి అనుకూలమైన రోజు. చేపట్టిన పనుల్లో విజ యం సాధిస్తారు.మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభి వృద్ధి సాధిస్తారు. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. చేపట్టిన పనులు చిన్న చిన్న అడ్డంకులతో పూర్తవుతాయి. స్నేహితుల ద్వారా అనుకోని సాయం అందుతుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

మకరం : ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. పనుల విషయంలో ఆవేశానికి లోనుకాకండి.

కుంభం

కుంభం : చేసే పనిలో అడ్డంకులు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే తలపెట్టిన ప్రయాణాలు వాయిదా పడతాయి. అయితే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అడ్డంకులు ఏర్పడినప్పటికి నిరాశకు లోనవకుండా పని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల సహాయం అందుకుంటారు. గృహ సంబంధ వ్యవహారాలపై డబ్బు ఖర్చు చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. తక్కువ శ్రమతో అనుకున్నది సాధిస్తారు. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి ద్వారా అనుకోని సాయం అందుకుంటారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu