ఫిబ్రవరి 15 గురువారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 15, 2018, 08:33 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఫిబ్రవరి 15 గురువారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : మీ బంధువులు, పరిచయస్థులను కలవటానికి వెళ్తారు. వివాహం, ఇతర శుభకార్యాల్లోనూ, వాటికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం కారణంగా ఇతరుల కోపానికి, అసహనానికి కారకులయ్యే అవకాశముంటుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది.

వృషభం

వృషభం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ పతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిథునం

మిథునం :ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదరసంబంధ, మూతసంబంధ అనారోగ్యంతో బాధపడతారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

సింహం

సింహం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ పతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.

కన్య

కన్య : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. పయాణాలకు సాధారణ దినం.

తుల

తుల : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యే అవకాశముంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశమున్నది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేయండి.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్న ప్రగతి సాధిస్తారు. మీరు పని చేసే సంస్థలు లాభాలు గడిస్తాయి. బ్యాంకు రావాల్సిన లోన్, ఆర్థిక సహాయం సమయానికి అందుతుంది. మీ పై అధికారుల మెప్పు పొందటమే కాకుండా ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు.

మకరం

మకరం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడితో స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కుంభం

కుంభం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

మీనం

మీనం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu