ఏప్రిల్ 11, 2018 బుధవారం మీ రాశిఫలాలు

Published : Apr 11, 2018, 09:36 AM IST
ఏప్రిల్ 11, 2018 బుధవారం మీ రాశిఫలాలు

సారాంశం

ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్య సమాచారం అందుతుంది.

మేషం

మేషం : ఉత్సాహంగా ఉంటారు. మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంది. పుకార్లు, చెప్పుడు మాటలను పట్టించుకోకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృషభం

వృషభం : కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలం. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు.

మిథునం

మిథునం : ఆర్థిక వ్యవహారాలు, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశముంటుంది. శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా పైఅధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం, ఏదైనా అడ్డంకి ఎదురవడం జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూలంగా ఉంటుంది.

కన్య

కన్య : ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

తుల

తుల : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూలం కాదు.

వృశ్చికం

వృశ్చికం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికావద్దు. ప్రశాంతతతో పనులు చేయగలుగుతారు.

ధనుస్సు :

అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్దకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం.బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది

కుంభం

కుంభం : ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం : కొంత బద్దకంగా ఉంటుంది. పనులు వాయిదా వేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయ, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగువేయాలి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోవద్దు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu