సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు యువరైతు ఆత్మహత్యాయత్నం

First Published Apr 10, 2018, 5:56 PM IST
Highlights
సూర్యాపేట నుండి సీఎంను కలవడానికి వచ్చి

తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ముందే ఓ సూర్యాపేట రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తన గోడు సీఎం తెలియజేయడానికి వచ్చిన ఓ యువరైతును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధింంచి వివరాల్లోకి వెళితే...సూర్యాపేట జిల్లాలోని పుప్పాల గూడ గ్రామానికి చెందిన సైదులు(24) అనే రైతు తన 11 ఏకరాల్లో పంట వేశాడు. అయితే ఈ పంట  చేతికొచ్చే దశలో పాడైపోయి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో ఈ పంటకోసం తెచ్చిన అప్పులు వడ్డీతో కలిసి భరించలేనంత భారంగా మారాయి. అంతే  కాకుండా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడి ట్రాక్టర్ కి దరఖాస్తేు చేసుకున్నప్పటికి అది రాలేదు. దీంతో తన గోడును సీఎం కేసీఆర్ కు చెప్పాలని క్యాంప్ కార్యాలయానికి వచ్చాడు. అయితే క్యాంప్ కార్యాలయం వద్ద వున్న సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు అదే క్యాంప్ ఆఫీస్ ముందు తనతో తెచ్చుకున్న పురుగుల మందుతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

click me!