21 మే 2018 సోమవారం మీ రాశిఫలాలు

Published : May 21, 2018, 09:46 AM IST
21 మే 2018 సోమవారం మీ రాశిఫలాలు

సారాంశం

వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు.

మేషం

మేషం : పనుల్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. ధైర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు పయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంది. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది.

వృషభం

వృషభం : అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్యం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూలంగా ఉంటుంది.

సింహం

సింహం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కన్య

కన్య : ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు. మధ్యాహ్నం తర్వాత కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

తుల : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి చాలా అనుకూలం. మీరు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి, అనుకోని లాభాలు కానీ, మిత్రులను కలుసుకోవడం గాని జరుగుతుంది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల వల్ల డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా పశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.

కుంభం

కుంభం : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. మంచి ఆహారం స్వీకరిస్తారు. భూసంబంధ లావాదేవీలు కొలిక్కివస్తాయి.

మీనం

మీనం : ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరా లు, ఉదర సంబంధ సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొం త సామాన్యంగా ఉంటుంది. బంధువులు లేదా వాహన కారణం గా డబ్బు ఖర్చవుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu