అందులో నెం.2 మనమే..!

First Published Jan 19, 2018, 4:58 PM IST
Highlights
  • మొబైల్ యాప్స్ డౌన్ లోడింగ్ పై ఆసక్తికర సర్వే
  • రెండో స్థానంలో నిలిచిన భారత్
  • అమెరికాను వెనక్కి నెట్టిన భారత్

మొబైల్ ఫోన్లలో యాప్స్ లను డౌన్ లోడ్ చేయడంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో అమెరికాను వెనక్కి నెట్టి మరీ భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. ఇక మొదటి స్థానంలో మాత్రం చైనా నిలిచింది. యాప్స్ మీద ఇటీవల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది.

అపరిమిత 4జీ డేటాను ఇస్తామంటూ 2016 సెప్టెంబరులో రిలయన్స్‌ జియో అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి భారత్‌లో యాప్‌ల వినియోగం శరవేగంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 2017లో మన దేశంలో యాప్‌ల వినియోగం 215 శాతం పెరిగిందని తెలిపింది. సగటున భారతీయులు నెలకు 40 కంటే ఎక్కువగా యాప్‌లను వినియోగిస్తున్నారట. అయితే అమెరికాలో మాత్రం 2016తో పోల్చుకుంటే గతేడాది యాప్‌లను వినియోగించేవారి సంఖ్య 5శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది.ఆ డౌన్ లోడ్ చేసిన యాప్స్ లో ఎక్కువగా వాట్సాప్ నే వాడుతున్నారట. వాట్సాప్ తర్వాతి స్థానంలో ఫేస్ బుక్, ట్విట్టర్, షేర్ ఇట్, ఇన్ స్ట్రాగ్రామ్ తదరిత యాప్స్ ఉన్నాయి.

click me!