16 జూన్ 2018 శనివారం మీ రాశిఫలాలు

Published : Jun 16, 2018, 09:18 AM IST
16 జూన్ 2018 శనివారం మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. 

మేషం

మేషం: ఈ రోజు పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది.

వృషభం

వృషభం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

సింహం

సింహం: బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది

కన్య

కన్య : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది.

తుల

తుల : మీరు ఏదైనా కొత్త పనికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలిగి పోతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విదేశీ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి.వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

ధనుస్సు

ధనుస్సు:ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగి పోతాయి. మీ భాగస్వామి నుంచి సహాయం అందుకుంటారు.

కుంభం

కుంభం : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. ఆర్థిక సంబంధ లావాదేవీలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. ఆచితూచి అడుగేయటం మంచిది. శత్రుబాధ తొలిగిపోతుంది.

మీనం

మీనం : ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువుల కారణంగా లేదా వాహన కారణంగా డబ్బు ఖర్చవుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. పోటీ పరీక్షలు రాసేవారికి అనుకూలం.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu