21 ఏప్రిల్ 2018 శనివారం మీ రాశిఫలాలు

Published : Apr 21, 2018, 09:31 AM IST
21 ఏప్రిల్ 2018 శనివారం మీ రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అనవసర ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభం

వృషభం :ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

మిథునం

మిథునం : పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడం మంచిది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడుతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. విదేశీసంబంధ వ్యవహారాలు వాయిదా పడుతాయి.

సింహం

సింహం :ఈ రోజు స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజూ గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కన్య

కన్య : ఈ రోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి. మీకు తగని పనుల జోలికి వెళ్లకండి. దాని కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

తుల

తుల :మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడడం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కోసం పిల్లలతో గడపడం మంచిది.

వృశ్చికం

వృశ్చికం :ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరో గ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

ధనుస్సు

ధనుస్సు : మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురిచేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది.అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢం గా ఉండటం మంచిది. దానివల్ల మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

కుంభం

కుంభం :స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకో ని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu