
చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆగస్టు 7వ తేదీన మూసివేయనున్నారు. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుంది. దీంతో స్వామి వారి మందిరాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నారు. తిరిగి 8వ తేదీ వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు.