బీహార్ సిఎం నితీష్ కుమార్ మీద మర్డర్ కేసు... ఇదిగో సాక్ష్యం

First Published Jul 29, 2017, 5:56 AM IST
Highlights

లాలూ ప్రసాద్ ఆరోపించినట్లు నితీష్ కుమార్  మీద మర్దర్ కేసు నమోదయిన మాట నిజం. పోలీస్ ఇన్వెస్టిగేషన్జ జరిగింది. ఆర్డర్ ఆఫ్ కాగ్నయిజాన్స్ జారీ అయింది. ఈ దశలో ఆయన కూడా  చాలా మంది ముఖ్యమంత్రుల లాగా హైకోర్టును ఆశ్రయించి  స్టే తెచ్చుకున్నారు.

 

రెండు రోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద ఆర్ జెడి నేత  లాలూ ప్రసాద్ తీవ్రమయిన ఆరోపణ చేశారు. నితీష్ మీద హత్యా నేరం ఉందని లాలూ వెల్లడించారు. హత్య కేసు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నితీష్ కుమారే నని లాలూ చెప్పారు.

ఇది తప్పుకాదు. తన  మీద ఉన్న హత్యానేరం కేసులను నితీష్ కుమార్ స్వయంగా వెల్లడించారు. 2012లో బీహార్ విధాన మండలి ఎన్నికలపుడు నితీష్ కుమార్ నామినేషన్ తో పాటు తనమీద ఉన్న కేసుల వివరాలతో ఒక అఫిడవిట్  ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.  ఆ ఆఫిడవిట్ ప్రకారం నితిష్ కుమార్ మీద  ఉన్న కేసులు. ఐపిసి సెక్షన్ 147( దాడులు),148( ఆయుధాల చట్టం),149,302(హత్య),307(హత్యాయత్నం) . ఈకేసులను 16.11. 1991లో బుక్ చేశారు. వీటిమీద పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. తుది నివేదికను అసిస్టెంట్ కమిషన్ అండ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ 5.8.2008 న అంగీకరించారు. దీనిని అధారం  చేసుకుని నితీష్ కుమార్ మీద కేసు పెట్టారు.  అయితే, ఆర్డర్ ఆఫ్ కాగ్నజాన్స్ మీద 8.92009న పట్నా హైకోర్టు స్టే ఇచ్చింది.

click me!