
సృష్టిలో దేనికైనా ప్రత్యామ్నాయముంటుందేమో గానీ ‘అమ్మ’కు మాత్రం లేదు. ఈ విషయాన్ని ఎందరో కవులు, గేయరచయితలు తమ కలాల ద్వారా నిరూపించారు. అయితే, అమ్మ ప్రేమ ఒక్క మనుషులకు మాత్రమే పరిమితం కాదు. సృష్టిలోని ప్రతీ జీవీకి అమ్మ ప్రేమ ఒకటేగా ఉంటుంది. ఆ విషయాన్ని నిరూపించే ఘటన ఒకటి ఆమధ్య జరిగింది. ఒక దూడ కారు క్రింద ఇరుక్కుపోయింది. దూడ బయటకు వస్తే గానీ కారు కదిలేందుకు లేదు. చుట్టూ విపరీతమైన ట్రాఫిక్. తన బిడ్డ కోసం తల్లి ఆవు ఆందోళన చెప్పనలవి కాదు. తన బిడ్డ క్షేమంగా బయటకు వచ్చేంత వరకూ ఎంత తపనపడిపోయిందో మీరే చూడండి.