అమెరికా భారతీయ వ్యాపారి హార్నిష్ పటేల్ కాల్చివేత

First Published Mar 4, 2017, 8:09 AM IST
Highlights

ఇంటికి కొంత దూరంలోనే మాటు వేసిన ఉన్న గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అతన్ని కాల్చేశారు.

భార‌తీయుడు అమెరికా జాత్యహంకారానికి బలయ్యాడు. క‌రోలినా రాష్ట్రంలో భార‌తీయ సంత‌తికి చెందిన వ్యాపారి హర్నీష్ ప‌టేల్‌(43)ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. ఆయన ఇంటి (262, క్రైయిగ్ మేనర్ రోడ్, లాంకాస్టర్ ) , సమీపంలో నే  ఈ ఘోరం జ‌రిగింది. హర్నీష్ ప‌టేల్‌కు పేజ్‌లాండ్ హైవేపై స్పీడ్‌మార్ట్ షాపింగ్ స్టోర్ ఉంది.ఎప్పటిలగే  రాత్రి 11.24 నిమిషాల‌కు షాప్ మూసి ఇంటికి వెళ్లాడు హర్నీష్. (ఈపోటో ఒక వారం కిందట హార్నిష్ దుకాణంలో ఉన్నప్పటిది. సర్వైలాన్స్ కెమెరాలనుంచి తీసినది.)

 

 అయితే ఇంటికి కొంత దూరంలోనే మాటు వేసిన ఉన్న గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అతన్ని కాల్చేశారు. హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశంలో కాల్పుల శ‌బ్దాలు, అరుపులు వినిపించిన‌ట్లు 911 నంబర్ పోన్ చేసి  ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. లాంకెస్ట‌ర్ కౌంటీ పోలీసులు హ‌త్యా ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతున్నారు.

కాల్పులు జ‌రిగిన ప్ర‌దేశం నుంచి పోలీసులు రెండు బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు.

 

క‌న్సాస్‌కు చెందిన తెలుగు వాడు  కూచిబొట్ల శ్రీ‌నివాస్ హ‌త్య కల్లోలం ఇంకా సద్దు మునగక ముందే మరొక భారతీయుడిని అమెరికా జాత్యహంకారులు పొట్టనపెట్టుకోవడంతో వారు ఇండియాను టార్గె ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ మ‌ధ్యే ఓ భారతీయ యువ‌తిపై న‌ల్ల‌జాతీయుడు వేధింపుల‌కు పాల్పడిన సంగతి ఒక వీడియోద్వారా ప్రపంచానికి తెలిసింది.

 

శ్రీ‌నివాస్‌ది జాత్యంహ‌కార దాడి అని అమెరికా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి స్వయాన అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు.

click me!