అరెస్టు కు కారణం ఆ ఫోటో కాదు.. ఇదే అసలు కారణం

Published : Apr 21, 2017, 10:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అరెస్టు కు కారణం ఆ ఫోటో కాదు.. ఇదే అసలు కారణం

సారాంశం

ముఖ్యంగా రవికిరణ్ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో తాను వైఎస్సార్ పార్టీ లో పనిచేసినట్లు చాలా స్పష్టంగా పేర్కొన్నాడు.  రేపెవరూ తనను అరెస్టు చేయకుండా అడ్రెస్ కూడా ప్రొఫైల్ లో తప్పుగానే పెట్టాడు. శంషాబాద్ లో నివసిస్తున్న ఆయన లివింగ్ ప్లేస్ ను సింగపూర్ గా పెట్టారు.

ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలక్కిపడింది.

 

ఏపీ లోని అధికార టీడీపీ పార్టీకి, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పొలిటకల్ పంచ్  పేరుతో కంటెంట్ రాస్తున్న రవికిరణ్ ను అరెస్టు చేయడంపై  ప్రజాసంఘాలు, సోషల్ మీడియా మండిపడుతోంది.

 

పెద్దల సభను అవమానించేలా రవికిరణ్ ఫొటో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఏపీ మండలి చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నే అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

 

అయితే కేవలం ఆ ఒక్క ఫొటో కారణంగా ఏపీ పోలీసులు హడావుడిగా అర్ధరాత్రి తెలంగాణలో ఉంటున్న రవికిరణ్ ఇంటికి వచ్చి అరెస్టు చేశారంటే నమ్మగలమా.. ?

ఆయన అరెస్టుకు ఎప్పటి నుంచో రంగం సిద్ధం చేశారన్నది సుస్పష్టం.

 

ముఖ్యంగా రవికిరణ్ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో తాను వైఎస్సార్ పార్టీ లో పనిచేసినట్లు చాలా స్పష్టంగా పేర్కొన్నాడు.  రేపెవరూ తనను అరెస్టు చేయకుండా అడ్రెస్ కూడా ప్రొఫైల్ లో తప్పుగానే పెట్టాడు. శంషాబాద్ లో నివసిస్తున్న ఆయన లివింగ్ ప్లేస్ ను సింగపూర్ గా పెట్టారు.

టీడీపీ, చంద్రబాబు లక్ష్యంగానే ఆయన పోస్టులు ఉన్నాయి. పైగా వైసీపీ పార్టీలో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్ నే పెట్టాడు. ఈ ఒక్క కారణం చాలదూ టీడీపీ ప్రభుత్వానికి ఆయనను అరెస్టు చేశడానికి. అందుకే అర్ధరాత్రి హుటాహుటిన ఆయనను జైళ్లో పెట్టింది.

 

అరెస్టుకు ఆ ఫొటో ఒక కారణం మాత్రమే. ఎందుకంటే ఇంతకంటే దారుణంగా సోషల్ మీడియాలో చంద్రబాబుపై చాలా సెటైర్లు  వచ్చాయి. ఇక తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానిస్తూ కొన్ని టీవీ చానెళ్లు దారుణంగా కథనాలు ప్రసారం చేశాయి. అయినా అరెస్టులు లాంటివి జరగలేదు.

 

వైసీపీ పై కక్షసాధింపులో భాగంగానే రవికిరణ్ అరెస్టును భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు రవికిరణ్ కు ఎంతవరకు మద్దతిస్తారో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !