నల్లోడు అన్నారని చుక్కలు చూపించిన బుడ్డోడు

Published : Apr 12, 2017, 08:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నల్లోడు అన్నారని చుక్కలు చూపించిన బుడ్డోడు

సారాంశం

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రనగర్‌ లో ఓ చిచ్చరపిడుగు వెరైటీ నిరసన  

బీజేపీకి చెందిన ఉత్తర భారత్ ఎంపీ తరుణ్ విజయ్ ‘దక్షిణ భారతీయులు నల్లోళ్లు అయినా వారితో కలిసే ఉంటున్నాం’ అని జాతి వివక్షత చూపినా మనం మాత్రం మౌనంగా ఉండిపోయాం. కానీ, ఈ చిచ్చరపిడుగు అలా కాదు... స్కూల్ లో ఫ్రెండ్స్ అంతా అతడిని నల్లోడా, కర్రోడా అనడంతో  తనదైన స్టైల్ లో వాళ్లకు చుక్కలు చూపించాడు.

 

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రనగర్‌ కు చెందిన వీరేశ్ స్థానికంగా ఉన్న స్కూల్ లోనే చదువుకుంటున్నాడు.అయితే తోటి విద్యార్థులు అతడిని కర్రోడా అని గేలిచేసేవారు. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పి ఇక తాను స్కూల్ కు వెళ్లనని వీరేష్ మారాం చేశాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం స్కూల్ కి వెళ్లాల్సిందేనని గదమాయించారు.

దీంతో వీరేశ్ స్కూల్ కు వెళ్లేదారిలో 30 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.  ‘ నేను బడికి పోను.. అందరూ నన్ను కర్రోడా అంటున్నారు ఇక్కడి నుంచి దూకేస్తా’ అంటూ బెదరించారు. గంట సేపు ఊరంతా గగ్గోలు పుట్టించాడు. చివరకు పోలీసులు నచ్చచెప్పడంతో కిందికి వచ్చాడు. స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి ఈ విషయం తీసుకొచ్చని పోలీసులు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !