ఇదిగో నల్లధనం ఇలా తయారువుతున్నది

First Published Nov 23, 2016, 8:24 AM IST
Highlights

లిక్కర్ బిజినెస్ లో  నల్లధనం ఎలా తయారవుతున్నదో చెబుతూ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

ఇదిగో నల్లడబ్బిలా తయారువుతూ ఉంది...

 

రాష్ట్రంలో విస్తరిస్తున్న మద్య వ్యాపారం వల్ల నల్లధనం ఎలా పేరుకుపోతున్నదో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

 

దీనిని  నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదుని చెబుతూ అధికార యంత్రాంగమే నల్లధనం పోగయ్యేందుకు సహరిస్తున్నట్లుగా ఉందని ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. సోము వీర్రాజు రాసిన ఉత్తరం లోని వివరాలివి:

 

“రాష్ట్రంలో సుమారు కోటి మంది  రోజూ మద్యం సేవిస్తున్నారు. వారి వద్ద నుంచి సుమారు రు. 30 అధికంగా వసూలు చేస్తున్నారు. 

దీని మూలంగా  రోజుకు 30, కోట్ల నెలకు, 900 కోట్లు సంవత్సరానికి  10800 కోట్లు,  దళారీలు, మరియు వ్యవస్థ లాభపడుతున్నారు. ఇదేడబ్బు బ్లాక్

మనీగా మారడానికి అస్కారం ఉంది.  ఈ మధ్య కాలంలో నేను రాజమహేంద్ర వరం, కాకినాడ, విశాఖ పట్నం,

విజయనగరం, శ్రీకాకుళం లో గల ఎక్సైజ్ అధికారులతో  మాట్లాడటం జరిగింది. 

అలాగే ఎన్ఫోర్స్ మెంటు అధికారులతో   కూడా మాట్లాడాను..”

 మద్యం దుకాణాలు ఉదయం పదిగంటలకు తెరచి రాత్రి పదిగంటలకు మూసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మద్యాన్ని

 

ఎంఆర్ పి ధరలకే  అమ్మెలా చూడాలని అంటూ,  జాతీయ రహదారుల మీద  దుకాణాల ఏర్పాటు నిషేధించాలని కూడా ఆయన కోరారు.

 బెల్ట్ షాపులను మూసేయాలని చెబుతూ దుకాణాలకు ఉన్న పర్మిట్ రూమ్స్ పేరుతో మిని బార్లుగా పనిచేస్తున్నాయని కూడా ఆయన అన్నారు. 

  మద్యం దుకాణాలలో ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ పాకెట్స్ అమ్మకుండా నిషేధించాలని ఆయన సూచించారు.

 

ఈవిషయాలను ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా చర్యలు తీసుకోవడం లేదని, చర్య లు తీసుకునేందుకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

click me!