పాచి మొఖాన్నే అంతా చేసే మొదటి పని ఇదే...

Published : Dec 30, 2016, 11:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పాచి మొఖాన్నే అంతా చేసే మొదటి  పని ఇదే...

సారాంశం

చేతి గడియారం తర్వాత  మన శరీరానికి ఇంతగా అతుక్కుపోయిన మరొక యాంత్రిక పరికరం మరొకటి లేదు...

 

స్మార్ట్ వోనర్లంతా పొద్దున్నే నిద్ర లేచీ లేవగానే చేసేదేమిటో తెలుసా... అలాగే పడుకోబోయేముందు వీళ్లంతో  చేసే రిచువల్ ఏమై ఉంటుంది.

 

 తప్పని సరిగా ఒక రౌండు ఫోన్ చెక్ చేయడమేనట.

 

స్మార్ట్ ఫోన్ దాదాపు పడక పార్టనర్ అయి కూర్చుంది. ఇటీవల ఇంతగా వ్యక్తి గత జీవితంలోకి చొరబడిన ఆధునిక పరికరంమరొకటి లేదు. అంతేకాదు, చేతిగడియారం తర్వాత  మనిషి శరీరానికి ఇంతగా అతుక్కుపోయిన వస్తువు కూడా ఇదే. 

 

 అందుకే పడుకోబోయే ముందూ, నిద్ర లేచీ  లేవంగానే హడావిడిగా తడుముకుని అందుకునేది స్మార్ట్ ఫోన్ నే నట.

 

మొత్తం స్మార్ట్ పోన్ కొన్నోళ్లందరిలో పాచిమొఖాన్నే ఆత్రంగా పోన్ చూసూకునే వారి సంఖ్య 61 శాతమట. ఒక సర్వే ప్రకారం వీళ్లంతా నిద్రలేచిన అయిదు నిమిషాల్లోపు పోన్ తాకకుండా మరొక పనిచేయరట.

 

ఈ విషయం డిలాయట్ గ్లోబల్  మొబైల్ కన్స్యూమర్ సర్వే -2016 లో వెల్లడయింది. ఫలితాాలను  ఇపుడు విడుదల చేశారు.

 

అదే విధంగా నిద్ర లేచాక మొదటి అరగంటలో  ఫోన్ ముందరేసుకునే వారి సంఖ్య మరీ ఎక్కువ. అది 88 శాతం ఉందట. మొత్తం 96 శాతం మంది మొదటి ఒక గంటలో ఫోన్ ను తప్పకుండా చూసి తీరతారట.

 

తమాషా ఏమిటంటే, 74 శాతం మంది స్మార్ట్ ఫోన్ వోనర్లు ఫోన్ చూసుకోకుండా పడుకునేదేలేదట.  నిద్రపోవడానికి 15 నిమిషాల ముందు వీళ్లంతా తప్పనిసరిగా ఒక రౌండ్ ఫోన్ చెక్ చేస్తారుట.

 

ప్రపంచం యావత్తు 53 వేల మందితో సర్వేచేసి ఈ విషయం కనిపెట్టారు.  ఈ సర్వేలో ఇండియానుంచి రెండువేల మంది పాల్గొన్నారు.

 

వీళ్లంతా బ్యాంకు బ్యాలెన్స్ లను తనిఖీ చేసేందుకు, కట్టాల్సిన బిల్స్ స్టేటస్ తెలుసుకునేందుకు, మెయిల్ చదువుకునేందుకు ... మరెన్నో ఇతర విషయాలు తెలుసుకునేందుకు స్మార్ట్ట్ ఫోన్ వాడుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !