
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరగుతున్నాయి. అందులో ఇదీ ఒకటి.
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో సర్వేషా దేవి అనే ఓ నిండు గర్భిణి బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడానికి స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లింది.
అక్కడ చాంతాడంత క్యూ ఉండటంతో చేసేది లేక తన వంతు వచ్చేవరకు అక్కడే క్యూలో ఉండిపోయింది. ఇంతలో ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.
ఆమెతో పాటు వచ్చిన అత్త... క్యూలో ఉన్న మహిళలు కలసి ఆ బ్యాంకులోనే ఓ గదిలోకి గర్భిణిని తీసుకెళ్లారు. అక్కడే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇప్పుడు ఆ బ్యాంకులో పుట్టిన బిడ్డకు ఆ కుటుంబ సభ్యులు క్యాషియర్ అనే పదం అర్ధం వచ్చేలా హిందీలో ‘ఖజాంచి నాథ్’ అని పేరు పెట్టారు.