
భారత చిరకాల మిత్రుడు రష్యాకు మన మీద కోపమొచ్చింది. ఇంతకీ ఎందుకో తెలుసా...
ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం. మన దేశంలో నోట్లు రద్దు అయితే రష్యాకు ఎందుకు కోపం అని అనుకుంటున్నారా...
పాపం.. భారత్ లో ఉన్న వాళ్ల దేశస్తులకు పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
ముఖ్యంగా భారత్ లో ఉన్న తమ దౌత్య కార్యాలయ సిబ్బందికి జీతాలు ఇప్పటి వరకు అందలేదట. అందుకే రష్యా .. పెద్ద నోట్ల రద్దుపై ఫైర్ అయింది. తమ దేశస్తుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదేనని నొక్కి చెప్పింది.
ఈ సమస్యను పరిష్కరించకపోతే భారత్ జరిపే వాణిజ్య కార్యకలాపాలు, ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రష్యా హెచ్చరించింది.
దీనిపై వెంటనే స్పందించాలని మాస్కోలోని భారత రాయభార కార్యాలయ అధికారులకు నోటీసులు కూడా పంపిస్తామని మందలించింది.
అంతకు ముందు పాకిస్తాన్ కూడా పెద్ద నోట్ల రద్దు వల్ల తమ దేశానికి చెందిన దౌత్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత్ కు తీవ్ర నిరసన తెలిపింది. వెంటనే తమ దేశస్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసింది.