
తెలంగాణా వచ్చి మూడేళ్లు కావస్తోంది. తెలంగాణాకు కేంద్ర శాఖలన్నీ ప్రతిబడ్జెట్ లో నిధులిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తో సహా పలువరు కేంద్ర మంత్రులు తెలంగాణా మంత్రులతో ఎన్నో సమావేశాలు పెట్టారు. కేంద్రమంత్రులెందరలో తెలంగాణా సందర్శించారు. పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే, తెలంగాణా రాష్ట్రం ఉనికి ఇంకాా ఆలోచనల్లోకి చొరబడలేదనేందుకు ఈ మ్యాప్ సాక్ష్యం.
పై ఫోటోలో ఉన్న మ్యాప్ ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ నిన్న ట్వీట్ చేశారు. స్మార్ట్ ఇండియ ా హ్యాకథాన్ 2017 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆయన ఒక సందేశం ట్వీట్ చేస్తూ ఈ మ్యాప్ కూడాట్వీట్ చేశారు. అయితే, ఇందులో తెలంగాణా లేకపోవడం, ఆయనకు గాని, ఆయన కార్యాలయానికి గాని కనిపించలేదు. ఈ మ్యాప్ ను అమోదించిన ఇతర సీనియర్ అధికారుల కంట పడటక పోవడం అశ్చర్యం.
తెలంగాణాలేని మ్యాప్ అందరికి ట్వీట్ చేస్తూ దేశంలోని 26 నగరాలలో 10,000 మందిదాకా 1266 టీములుగా ఏప్రిల్ 1,2 తేదీలలో ఈ హ్యాకధాన్ లో పాల్గొంటారని జవడేకర్ పేర్కొన్నారు. ఇది 36 గంటల నాన్ స్టాప్ కోడింగ్ . ఇంతపెద్ద హ్యాకథాన్ జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ 26 నగరాలలో హైదరాబాద్, తెలంగాణా రాజధాని, కూాడా ఉంది. 58 కేంద్ర మంత్రిత్వశాఖ కు చెందిన 598 సమస్యలకు కొత్త పరిష్కారాలు వెదకడం నాన్ స్టాప్ కోడింగ్ ఉద్దేశం. ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం 11 గంటలకు ఈ హ్యాకధాన్ 2017ని ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారు.
కార్యక్రమం ప్రకారం, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో తెలంగాణా ప్రభుత్వ వికలాంగుల సాధికార శాఖ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.
పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనే సంస్థ ఈ కార్యక్రమం ఆర్గనైజర్.