
నెటిజన్ల సృజనకు హద్దే లేకుండా పోతుంది. ఏ విషయానైనా సూటిగా, ధాటిగా చెప్పడమే కాదు... సున్నితమైన హాస్యం, సుతిమెత్తని విమర్శలతో ఆలోచింప చేసేలా ట్వీట్లు చేస్తున్నారు. కామెడీతో కిర్రెక్కిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు తో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే దీనిపై ఒక్కో నాయకుడు ఒక్కోలా స్పందించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నోట్ల రద్దు నా సూచనే అని మొదట డబ్బా కొట్టారు. చివరికి నోట్ల రద్దుపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అబ్బే ఆ నిర్ణయం నా వల్ల జరిగింది కాదు... అసలు కేంద్రం ప్లానింగ్ లేకుండా నోట్లను రద్దు చేసింది అంటూ మోదీపై తెగ ఫైర్ అయిపోయారు.
ఇంకే ముందు నెటిజన్లకు బాబు గారి ఈ రెండు మాటలు మంచి కామెడీ సరుకుగా మారాయి.
టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళీ, జూనియర్ ఎన్టీయార్ కు మధ్య ఉండే డైలాగ్ లను పేరడీ చేసి చంద్రబాబును ఏకీపడేశారు....
మీరు మారిపోయారు సార్.... నిజంగా మీరు మారిపోయారు...
అప్పుడు నోట్ల రద్దు నా వల్లే అని చెప్పింది మీరే సార్...
జనం అష్టకష్టాలు పడుతుంటే మీరు మాత్రం తమ్ముళ్లతో ఆ ఘనత నాదే అని ప్రచారం చేయించారు సార్..
క్యూ లో నిలబడి జనాలు చస్తుంటే... ప్రజలంతా డిజిటల్ కు మారాలని అన్నది మీరే సార్...
ఇప్పుడేమో నోట్ల రద్దు వల్ల జనం బాధలు పడుతున్నారని అంటున్నారు సార్...
సార్.... మీరు మారిపోయారు...
చిల్లర లేక ప్రజలంతా పస్తులుంటున్నారని ఇప్పుడు తెలిసందా సార్.. మీకు...
అప్పడేమో నోట్లు రద్దు చేయాలన్నారు.. ఇప్పుడేమో నోట్ల రద్దు తప్పుడు చర్య అంటున్నారు...
ఇప్పడు గుర్తొంచిందా సార్ ప్రజల కష్టాలు...
ఇదే సార్... మార్పు అంటే...
మీరు.... మారిపోయారు సార్ ర్ ర్ ర్....
నిజంగా మీరు మారిపోయారు.....