ఈ మేధావి ఏమి చేస్తారో

Published : Nov 28, 2016, 08:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఈ మేధావి  ఏమి చేస్తారో

సారాంశం

నోట్ల రద్దు, తదనంతర పరిణామాల నుండి గట్టెక్కించేందుకు చంద్రబాబు ఏమి సిఫారసు చేస్తారనేది ఆశక్తిగా మారింది.

 

ఈ సారి ఏమి సిఫారసు చేస్తారో చూడాలి. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను చక్కదిద్దేందుకు కేంద్రం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ కమిటి వేసింది. సదు కమిటికి చంద్రబాబునాయడును సారధ్యం వహించాలని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీనే స్వయంగా చంద్రబాబును కోరారు. దాంతో గడచిన 20 రోజులుగా దేశాన్ని పట్టి ఊపేస్తున్న ఆర్ధిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు ఇపుడు తన మేధావితనాన్ని ఉపయోగించే అవకాశం వచ్చింది.

 

ఏకపక్ష నిర్ణయంతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇపుడు సమస్య నుండి బయటపడేందుకు చంద్రబాబు సాయం కోరటం కీలకం. ఈ కమిటిలో మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, బీహార్ సిఎం నితీస్ కుమార్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఉంటారు. ‘తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి’ అన్న రీతిలో మోడి ప్రవర్తిస్తుంటే యావత్ దేశం అతలాకుతలమైపోతోంది.

 

ఈ నేపధ్యంలో కేంద్రం ఒక కమిటీ వేయటం విశేషమే. ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దు చేయమని తానే ప్రధానికి సిఫారసు చేసానని గతంలో చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే దాని ఫలితంగా ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెకించే  మార్గాన్ని సూచించే కమిటికి అదే చంద్రబాబును మోడి ఛైర్మన్ చేయటం గమనార్హం.

 

గతంలో కూడా స్వచ్ఛ భారత్ కమిటికి చంద్రబాబును ఉపాధ్యక్షుడిని చేసిన తర్వాత నిధుల సమీకరణకు అందరిపైనా ‘స్వచ్ఛ భారత్ పన్ను’ వేయమని చంద్రబాబు సిఫారసు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నోట్ల రద్దు, తదనంతర పరిణామాల నుండి గట్టెక్కించేందుకు చంద్రబాబు ఏమి సిఫారసు చేస్తారనేది ఆశక్తిగా మారింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !