బస్సుకొట్టినా బతికాడు... బార్ వైపు నడిచాడు

Published : Jun 29, 2017, 06:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
బస్సుకొట్టినా బతికాడు... బార్ వైపు నడిచాడు

సారాంశం

ఇతగాడు నిజంగా మృత్యుంజయుడే. అంతకంటే ముఖ్యం ఈ మృత్యుంజయరావు చావునుంచి బయటపడ్డాక, బతికాం రా దేవుడు అనుకుంటూ దేవుడి దండంపెట్టేందుకు గుడివైపు పరిగెత్తలే. రెండు పెగ్గులేసుకుందామని బార్ వైపు బరబరా నడుచుకుంటూ వెళ్లాడు.

ఇతగాడు నిజంగా మృత్యుంజయుడే. అంతకంటే ముఖ్యం ఈ మృత్యుంజయరావు చావునుంచి బయటపడ్డాక, బతికాం రా దేవుడు అనుకుంటూ ఇష్టదైవానికి  దండంపెట్టేందుకు గుడివైపు పరిగెత్తలే. రెండు పెగ్గులేసుకుందామని బార్ వైపు బరబరా నడుచుకుంటూ వెళ్లాడు.

 

ఒక లండన్‌ శివారు పట్టణానికి చెందిన మన్ స్మిత్ వయసు 53 యేళ్లు. ఒక రోజు రోడ్డు మీద తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ  లోపు వెనకవైపు నుంచి  స్పీడుగా వచ్చిన బస్సొకటి ఢీ కొట్టింది. దీంతో స్మిత్ ఎగిరి పడ్డాడు దూరంగా.

 

 బస్సు ఢీకొనడంతో అక్కడ ఉన్న బిల్డింగు ముందు భాగం తునకలై పోయింది.  స్మిత్ పోయాడనుకున్నారు. అయితే అలా జరగలేదు. మనస్మిత్ గారికి చిన్న గాయం కూడా తగల్లేదు. లేచి దుమ్ము దులుపేసుకుని తన కిష్టమయిన బార్ వైపు నడిచాడు రెండుపెగ్గు లేసుకుందామని.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !