అమెరికాలో తెలుగు తల్లీ కొడుకుల హత్య

Published : Mar 24, 2017, 06:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అమెరికాలో తెలుగు తల్లీ కొడుకుల హత్య

సారాంశం

సాఫ్ట్ వేర్  ఇంజనీర్ శశికళ , కొడుకు అనీష్ సాయి లను గొంతుకోసి హత్య చేశారు

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన తల్లి కొడుకును ఎవరో హత్య చేశారు.

 

అమెరికా న్యూజెర్సీలోని మ్యాపుల్‌సెట్‌లో వారు దారుణ హత్యకు గురయ్యారు. తల్లి శశికళ (40)తో పాటు ఆరేళ్ల కుమారుడు అనీష్ సాయి (7)లను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందినవారని తెలుస్తోంది. భర్త నర్రా హనుమంతరావు. ఆయన ఆఫీసుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య, కొడుకు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు.

 

శాసన సభ్యుడు వై సాంబశివరావు అమెరికా తెలుగు అసోషయేషన్ సభ్యులతో ఫోన్ చేసి ఈ విషయం గురించి వాకబు చేశారు.

 

హనుమంతరావు,శశికళ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. శశికళ ఇంటిదగ్గిర నుంచే పనిచేస్తుంది. వారు గత తొమ్మిది సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నారు.

 

తెలుగువారికి సంబంధించి ఇటీవల జరిగిన హత్యల్లో ఇది మూడవది. ఫిబ్రవరి 23న కాన్సాస్ లో శ్రీనివాస్ కూచిబోట్ల ను ప్యూరింటన్ అనే మాజి నేవీ ఉద్యోగికాల్చిచంపాడు. అంగకు ముందు   ఫిబ్రవరి 10న కాలిఫోర్నియా , మిల్పిటాస్ లో  మామిడాల వంశీ రెడ్డిని అపార్ట్ మెంట్ గ్యారేజీలో నే కాల్చి చంపారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !