దేవుడికీ తప్పని జిఎస్ టి దెబ్బ

Published : Jul 01, 2017, 06:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
దేవుడికీ తప్పని జిఎస్ టి దెబ్బ

సారాంశం

దేవుడు కూడా ప్రధాని మోదీ తీసుకొచ్చిన జిఎస్ టి  దెబ్బనుంచి తప్పించుకోలేకపోయాడు.ఆంధ్రప్రదేశ్ లోని 179 దేవాలయాలలో కొలువై ఉన్న దేవుళ్లంతా  ఈ రోజు అర్ధరాత్రి నుంచి  అమలు లోకి వచ్చిన జిఎస్టి పరిధిలోకి వస్తారు.రూ.20 లక్షల ఆదాయం మించిన దేవుళ్లంతా  జీఎస్టీ కోసం తమ ఆలయాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.

దేవుడు కూడా ప్రధాని మోదీ తీసుకొచ్చిన జిఎస్ టి  దెబ్బనుంచి తప్పించుకోలేకపోయారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 179 దేవాలయాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి  అమలు లోకి వచ్చిన జిఎస్టి పరిధిలోకి వచ్చాయి.

 

రూ.20 లక్షల ఆదాయం మించిన దేవుళ్లంతా  జీఎస్టీలో తమ ఆలయాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఏండోమెంట్ శాఖకు,ఆలయాలు కార్యనిర్వహణాధికారులకు లేఖలు రాసింది.

 

అంతేకాదు, దేవుళ్లు తప్పించుకుంటారేమో నని దేవాదాయ శాఖని 20లక్షల పైబడి ఆదాయం ఉన్న ఆలయాల జాబితా కావాలని అడిగారు. దీనితో  ఆలయాల ఆదాయంపై దేవాదాయ శాఖ వివరాలు సేకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో  మొత్తం 23,834 ఆలయాలు ఉన్నాయి. ఆదాయాన్నిబట్టి వాటిని ఏ, బీ, సీ, డీ,ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో రూ.20 లక్షల మించి ఆదాయం ఉన్న ఆలయాలు 179 ఉన్నట్లు కనుగొన్నారు.వీటిలో 45 ఆలయాల ఆదాయం రు.25 లక్షల నుంచి రు. 1 కోటి దాకా ఉంటుంది.

 

ఒక కోటి రుపాయలనుంచి రూ.25 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు 63 ఉన్నాయి.  రూ.25 కోట్ల ఆదాయం దాటే ఆలయాలు 7 ఉన్నాయి. మిగతా వన్నీ రు. 20 లక్షల లోపు క్యాటగరిలోపడతాయి.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !