
ఖమ్మం జిల్లాకు చెందిన రవి కుమార్ కూతురైన శ్రావ్య కల్యాణపు ప్రపంచ సుందరి పోటీలవైపు పరుగుతీస్తున్నది.
ఈ వార్తతో ఈ ప్రాంతంలో సర్వత్రా సంతోషం వెల్లివిరిస్తున్నది.
శ్రావ్య ఇపుడు కెనడా దేశస్థురాలు.
అల్బర్టా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నది. ఆమె ఇప్పటికికే మిస్ నార్త్ అల్బర్టా కిరీటం గెల్చుకుంది.జూలైలో టొరంటో లో జరిగే మిస్ వరల్డ్ కెనడా పోటీలలో పాల్గొంటున్నది.
తండ్రి రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా 2004 నుండి 2006 వరకు పని చేశారు.
సుమారు 12 సంవత్సరాల కిందట ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో కెనడా వెళ్లారు. అప్పటికి శ్రావ్య వయసు 10 సంవత్సరాలే.
గత రెండేళ్లుగా ఆమె న్యూమా మోడెలింత్ ఏజన్సీస్ మోడెలింగ్ చేస్తున్నారు.
దీంతో శ్రావ్య విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. అందుకే ఆ దేశం నుంచి అంతర్జాతీయ సౌందర్య పోటీలలో పాల్గొంటున్నది.