బహరేన్ లో నేల రాలిన తెలంగాణ బిడ్డ

First Published Jun 18, 2017, 12:20 PM IST
Highlights

ఎన్నో ఆశలతో పొట్ట చేతిన పట్టుకుని  సముద్రాలు దాటి పరాయి దేశానికి బయలెళ్లి ఏప్రిల్ నెలలో బహరేన్  వచ్చాడు సేవ్య రోత్సవం(32). నిజామాబాద్ జిల్లా, మాచారెడ్డి మండలంలోని, రెడ్డిపేట్ తండాకు చెందిన వాడు. ఆర్నెళ్లయినా  తిరక్కుండానే గుండె పోటుతో చనిపోయాడక్కడ.

 

 

ఎన్నో ఆశలతో పొట్ట చేతిన పట్టుకుని సముద్రాలు దాటిపరాయి దేశాలకు పయనమయి  ఏప్రిల్ నెలలో బహరేన్  వచ్చాడు సేవ్య రోత్సవం(32). నిజామాబాద్ జిల్లా, మాచారెడ్డి మండలంలోని, రెడ్డిపేట్ తండాకు చెందిన వాడు."సేవ్య రోత్సవం(బట్టు). ఆయన  పాస్పోర్ట్ నెంబర్: M3852123 "నస్’’ కంపెనీకి వచ్చి కనీసం రెండు నెలలు కాలేదు ఇంతలోనే విధి వెక్కిరించింది. 

ఈ చిన్న వియసులో, కలలను ఛిద్రం చేస్తూ  మృత్యువు 12 జూన్ 2017న గుండెపోటు రూపంలో కబళించింది. ఇది చాలా బాధకరమయిన విషయం.

 సేవ్యకు, తల్లి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు నలూగురూ పిల్లలు ఉన్నారు.

 కుటుంబాన్ని అదుకుంటాడు, సమీపంలో భవిష్యత్తు ను వూహించుకుని ఆయనను సాగనంపిన, నిరుపేద కుటుంబం  దిక్కును కోల్పోయింది.

మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయం గురించి మిత్రులు యోచిస్తున్నారు.

సేవ్య చిన్న బాపు కొడుకు  కిషన్ బట్టు కూడ బహరేన్ లోనే ఉన్నాడు.

ఈ సమాచారాన్ని వారు కంపెనీకి, ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడాయన.

 వెంటనే స్పందించిన సభ్యులు సేవ్య కంపెనీ యజమాని/అధికారులతో మాట్లాడి వారి ద్వార మృతదేహాన్ని స్వగ్రామానికి తొందరగా పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

click me!