12 మంది తెలంగాణ ఐఏఎస్ అధికార్లకు అవార్డులు

First Published Aug 13, 2017, 11:36 AM IST
Highlights

తెలంగాణలో విశిష్ట సేవలందించిన పలువురు ఐఎఎస్ లకు ఈ ఏడాది ‘ఎక్స్ లెన్స్’  అవార్డులు ప్రకటించారు. పంద్రాగస్టున అవార్డులు అందచేస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారులకు, వాళ్ళ బృందాలకు, 2017 తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు ప్రకటించారు.

పంద్రాగస్టు సందర్బంగా అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందచేస్తారు. ఇందులో విన్నూత్న కార్యక్రమాల అమలులో ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వాళ్ళ బృందాలకు, జనరల్ క్యాటగరీలో మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వాళ్ళ బృందాలకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు ప్రకటించారు.ఇదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్, స్వీయ రక్షణకు శిక్షణ అందించేకార్యక్రమం ప్రారంభించిన  జనగామ కలెక్టర్ దేవసేనకువిన్నూత్న కార్యక్రమాల  పురస్కారం లభించింది. ఉట్నూర్ ఐటీడీఏలో స్టార్-30 కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ తోపాటు మరో ఇద్దరు ఐఏఎస్ లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతీలకు  లకూ ఇదే పురస్కారం లభించింది.

పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం అభివృద్ధిలో హెచ్ఎమ్డీఏ కమిషనర్ టీ చిరంజీవుల అవార్డుకు ఎంపిక య్యారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల పునరావాస కేంద్రం మానవతా సదన్ నిర్వహణలో నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు, ప్రభుత్వ వైద్య సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేందుకు చేస్తున్న కృషికి భూపాల పల్లి జిల్లా కలెక్టర్ ఏ. మురళి, డీఎంహెచ్ఓ ఏ అయ్యప్పలకు, వరి ధాన్యం సేకరణలో జగిత్యాల కలెక్టర్ శరత్ లకు పురస్కారాలు అందుతున్నాయి.

మిషన్ భగీరథ కోసం సిద్దిపేట కలెక్టర్ వెంకట రమణా రెడ్డికి,మిషన్ కాకతీయలో కొత్తగూడెం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లు అవార్డు లు అందుకోనున్నారు.

కల్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ కార్యక్రమాల అమలు కోసం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ తోపాటు మరి కొందరికి,హరితహారం కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రస్థాన్ జె పాటిల్ తోపాటు మరికొందరికి,ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమంలో నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తోపాటు మరికొందరికి పురస్కారాలను ప్రకటించారు.

click me!