ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 13, 2017, 10:46 AM IST
Highlights
  • శిల్పా మోహన్ రెడ్డి ఫిరాయించడాంటున్న కాల్వ
  • ఇండోనేషియాలో భారీ భూకంపం
  •  ఆగని గోరఖ్ పూర్ చిన్నారుల మరణాలు
  • షూటింగ్ లో గాయపడ్డ అమితాబ్ 
  • కుప్పకూలిన శ్రీలంక జట్టు

135 పరుగులకే లంక ఆలౌట్

మూడో టెస్ట్ లో భారత బౌలర్ల దాటికి  శ్రీలంక జట్టు విలవిల్లాడింది.   కేవ‌లం 135 ప‌రుగుల‌కే చాప చుట్టేసారు సింహాళీ భ్యాట్స్ మెన్స్. భారత స్పిన్న‌ర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో లంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో   తొలి ఇన్నింగ్స్‌లో 352 ప‌రుగుల   ఆధిక్యం భారత్ కు ల‌భించింది. మొదటి టెస్ట్ లో మాదిరిగానే రెండో టెస్ట్‌లోనూ ఫాలోఆన్ ఆడ‌నుంది శ్రీలంక‌. 

గంజాయి ముఠా అరెస్టు

హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు అరెస్టు చేశారు. విశాఖపట్నం - షోలాపూర్‌ మద్య నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లో గంజాయిని తరలిస్తుండగా సికింద్రబాద్  పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు ముత్యం బబిత(25), ముత్యం సునీల్‌కుమార్‌(20),  విద్యాసాగర్‌సింగ్‌(25)లుగా పోలీసులు గుర్తించారు. 
 

అప్రమత్తమయిన ఒంగోలు అధికారులు 

ఒంగోలు:  జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ప్రభుత్వ అధికారులకు ,సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల స్థాయి అధికారులు స్థానిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు,  టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 లేదా ల్యాండ్‌ లైన్‌ నంబర్‌ 08592 – 281400కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.  
 

మరో ఇద్దరు అధికారులపై చర్యలు
 

రాజన్న జిల్లా నేరెళ్ల ఘటనలో మరో ఇద్దరు పోలీస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసు శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్సైపై చర్యలు తీసుకున్న అధికారులు, ఇంఛార్జి డిఎస్పీ, సీఐలకు కూడా ఛార్జ్ మెమో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.  

షూటింగ్ లో గాయపడ్డ సీనియర్ నటుడు 

బాలీవుడ్ నటుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్‌బచ్చన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. యాక్షన్ సీక్వెల్ తీస్తుస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్  మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో  ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో ఆయన పక్కటెముకల్లో చీలిక ఏర్పడింది. ఇది చాలా చిన్న గాయమని,కొన్ని రోజుల్లో పూర్తిగా నయమవుతుందని   వైద్యులు తెలిపారు.అయితే ఈ ప్రమాద వివరాలను సినిమా బృందం గోప్యంగా ఉంచింది.

నంద్యాల ప్రచారంలో తాను డబ్బు పంచలేదు

నంద్యాల వైసీపి అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్‌ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ మండిపడ్డారు. తాను డబ్బులు పంచుతున్నట్లు టీడిపి నాయకులు ఆరోపిస్తున్న వీడియోలో నిజం లేదన్నారు.దాన్ని వారు పోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని, అదే గనుక నిజమైనదని తేలితే తన తండ్రిని పోటీ నుంచి తప్పుకోమని చెబుతానని సవాల్ విసిరారు. టీడిపి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఉప ఎన్నికలో  వైఎస్సార్సీపీ  గెలుపు ఖాయమని  కిశోర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 

పోలీసులే నింధితులు 

రాయదుర్గం సిఐ దుర్గ ప్రసాద్, సైబరాబాద్ అదనపు డిసిపి పులిందర్, ఎస్ఐ రాజ్ శేఖర్, కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ పై   రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు 

భూ వ్యవహారంలో బలవంతంగా చెక్ లపై సంతకాలు పెట్టించారంటూ సైబరాబాద్ సిపి ను ఆశ్రయించిన భాదితులు 

నలుగురిపై కేసు నమోదు చేయాలంటూ ఏసీపీ మాదాపూర్ ను ఆదేశించిన సిపి సందీప్ శాండిల్య 

448,365,342,384,147,506 R/W 149 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు

రెండు ఎకరాల భూమిని గతంలో లీజుకు తీసుకున్న అదునపు డిసిపి పులిందర్ కూతురు 

లీజ్ ముగియడంతో రెండు ఎకరాల ల్యాండ్ మాదే అంటూ ఓనర్ కు రెండు నెలలుగా బెదిరించి తప్పుడు కేసులు బనాయించిన  ఈ నలుగురు పోలీస్ అధికారులు

79 కి చేరిన గోరఖ్ పూర్ మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్  హాస్పిటల్లో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ఒక్క ఈ రోజే మరో 16 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. దీంతో మొత్తం మృత్యువాత పడ్డ చిన్నారుల సంఖ్య 79 కి చేరింది. ఈ దుర్ఘటన జరిగిన బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాలను ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. ఆయనతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఉన్నారు. వారు బాధిత కుటుంబాలను పరామర్శించి,  వైద్యులతో సంఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.  ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే మెజిస్టిరియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

టెస్టుల్లో మొదటి శతకం బాదిన హార్దిక్ పాండ్యా


టీమిండియా  ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా విద్వంసకర ఇన్నింగ్స్ ఆడి  టెస్టుల్లో తన మొదటి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 86 బంతుల్లోనే శతకం బాది శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో టీం ఇండియా భారీ స్కోరు సాధించింది.
 

తెలంగాణ ఐఏఎస్‌లకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

12 మంది ఐఏఎస్‌ అధికారులకు  తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్‌ ఈ అవార్డులు అందజేయనున్నారు.  అలాగే  మరో 100 మంది ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహక పతకాలు అందజేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

అక్రమంగా రవాణచేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

వరంగల్  జిల్లాలోని చెన్నారావుపేట లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేసారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
  

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైన భూకంప తీవ్రత సుమత్రా దీవులకు సమీపంలో సంభవించింది. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్ల సునామీ లాంటి పెను ప్రబాదం తప్పిందని యూఎస్ జియాలజికల్ సర్వే శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండోనేషియాలోని బెంకులు పట్టలణానికి 35 కిలోమీటర్ల దక్షిణాన భూకంప కేంద్రం నమోదైందని వారు తెలిపారు. 

సీఎం వరంగల్ పర్యటన వాయిదా

వరంగల్ రూరల్ : మెగా టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన చేయడానికి ఖరారైన సీఎం కేసీఆర్‌ వరంగల్ పర్యటన వాయిదా పడింది.  ఈ నెల 16వ తేదీన సంగెం, గీసుగొండ మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్కుకు  సీఎం చేతులమీదుగ శంకుస్థాపన జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. 

విమానానికి తప్పిన ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయం లో కార్గో విమానానికి  పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. టేకాఫ్ తీసుకుని కొద్ది దూరం ప్రయాణించాక ఇంజన్ మొరాయించింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఎయిర్ పోర్ట్ లోనే తిరిగి సేఫ్ గా ల్యాండ్ చేసాడు.

కొండచరియలు విరిగిపడి నల్గొండ వాసుల మృతి

నల్గొండ : అరుణాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లావాసులు మృత్యువాత పడ్డారు.  వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో సుశీటెక్ కంపెనీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న కొండల్ రెడ్డి,రాజిరెడ్డి మరణించారు. వారిని తెలంగాణ వాసులుగా గుర్తించిన పోలీసులు వారి భందువులకు సమాచారం అందించారు.                       

రూ .125 కోట్లతో బాసర అభివృద్ది

బాసర సరస్వతి అమ్మవారి ఆలయం అభివృద్ధికి  రు. 125 కోట్లతో ప్రణాళిక తయారవుతున్నదని  నిజామాబాద్  ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. బాసరలో లో ఆదివారం ఉదయం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బాసర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.అలాగే జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బాసరలో కవి సమ్మేళనం నిర్వహిస్తామనికూడా  ఆమె చెప్పారు. ఈ మధ్య ఆమె రాష్ట్రమంతా కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ ఉన్నారు.

ఐదో రోజుకు చేరుకున్న జగన్ నంద్యాల క్యాంపెయిన్

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసిపి అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌ షో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నంద్యాల పట్టణం లోని శ్రీనివాస సెంటర్‌ నుంచి ఆయన క్యాంపెయిన్ మొదలయింది. ఇది  బాలాజీ కాంప్లెక్స్, పైప్‌లైన్‌ రోడ్, సింగ్‌ కాలనీ, ఫరూక్‌నగర్, చౌరస్తా వరకు రోడ్‌షో కొనసాగుతోందని పార్టీ ప్రకటించింది. ఈ రోజు ఆయన
ఫరూక్‌ నగర్, ఎన్‌ఆర్‌ఎస్‌ మూర్తి హాస్పిటల్, స్కావెంజర్స్, బాల్కొండహాల్, సంచిబట్టల సందులతో పాటు  వెంకటేశ్వర దేవాలయం సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్, మేడం వారి వీధి, జుమ్మా మసీదు, గాంధీచౌక్‌, కల్పనా సెంటర్,పళని కూల్‌డ్రింక్స్‌ సందు, ముల్లాన్‌పేట మీదుగా  బైర్మల్‌వీధి, మున్సిపల్‌ హైస్కూల్‌ సెంటర్, చాంద్‌బాడ  దాకా ప్రచారం చేస్తారు.

మూసీ మురికి వదులుకొట్టడానికి రు.1665 కోట్లు

కాలుష్యానికి కేంద్రంగా మారిపోయిన మూసీ నదిని అందమైన విహారకేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు రూ. 1,665కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. నదికి ఇరువైపులా సైక్లింగ్‌ట్రాక్‌.. నడకదారి ఉండేలా చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం అధికారులు త్వరలో టెండర్లు పిలవనున్నారు.

 రాజకీయాల్లోకి మరొక నటుడు

 

ప్రజల కష్ట నష్టాల్ని తీర్చేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు కన్నడ.. తెలుగు నటుడు ఉపేంద్ర ప్రకటించారు. పూర్తికాలం రాజకీయాల్నే చేస్తానని, ఇందుకోసం సినిమాల్లో నటించే అవకాశాల్ని వదులుకున్నట్లు ఆయనప్రకటించారు.ఖాకి డ్రెస్ వేసుకుని ఆయన ఈ వార్తను వెల్లడించారు. తన పార్టీ జన నాయక, జన సేవక వంటి ది కాదని, ఇది జన కార్మిక అని, తన డ్రెస్ దానికి సంకేతమని ఉపేంద్ర రావు చెప్పారు.

పాక్ లో మరొక బాంబు పేలుడు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టా నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17మంది మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు. సైనికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేయాలని భావించారని.. కానీ.. సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని బలూచిస్థాన్‌ హోమంత్రి సర్ఫ్‌రాజ్‌ బుగ్తి అన్నారు.

చిత్రం, శిల్పాని ఫిరాయింపుదారుడంటున్న కాల్వ

మొన్నటి వరకు తెదేపాలో ఉండి ఉప ఎన్నికల్లో వైకాపా టికెట్‌ ఇస్తామంటే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తున్న అవకాశవాది శిల్పా మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడుతూ నంద్యాలలో పవిత్ర యుద్ధం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రజాప్రతినిధి మృతి చెందినా వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని ఇస్తూ వస్తున్నారు. ఉప ఎన్నికల్లో భూమా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి టికెట్‌ ఇస్తారని తెలిసి తెదేపాలో ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరి పోటీ చేస్తున్నారన్నారు.

ఐక్యూలో ఐన్ స్టీన్ తో సమానమయన తెలుగు కుర్రోడు

బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థి బండి యంశ్వంత్‌(12) ప్రతిష్ఠాత్మక మెన్సా ఐక్యూ  పరీక్షలో 162 స్కోర్‌ సాధించాడు. ఈ పరీక్షలో సాధించిన అత్యధిక స్కోర్‌ ఇదే. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ సాధించిన స్కోర్‌ 160.

click me!