అమితాబ్ బచ్చన్ కు రైతుల ఉసురు తగులుతుంది

First Published Jun 22, 2017, 1:14 PM IST
Highlights

అమితాబ్ అంటే నాకు  గౌరవం.రైతులకు హాని చేస్తున్న  జీఎస్టీ ప్రకటనల  నుంచి తప్పుకోవాలి.
లేకపోతే అమితాబ్ కు రైతుల ఉసురు తగులుతుంది.రైతులకు ఉపయోగపడే ఏ వస్తువును జీఎస్టీ పరిధిలోకి తేవద్దు-విహెచ్

వ్యవసాయ ఉత్పత్తులనుజిఎస్ టి (GST) పరిధిలో చేర్చడానికి నిరసనగా ట్యాంక్ బండ్  దగ్గిర అంబేద్కర్ విగ్రహం ముందు మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ధర్నా చేశారు.ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ మోదీ  వ్యవసాయ  పట్ల అనుసరిస్తున్న దోరణిని తీవ్రంగా విమర్శించారు.

 

‘‘మోదీ ఏనాడు రైతు ఇంటికి వెళ్లలేదు.విదేశాలకు మాత్రం బాగా తిరుగుతున్నాడు.మోదీ హయాంలో ఇతర రాష్ట్రాలో ఇక్కడ తెలంగాణలో రైతుల పై దేశద్రోహం కేసులు పెడుతున్నారు.పెట్టుబడిదారులకు ఇస్తున్న  మినహాయింపులు రైతులకు ఇవ్వడానికి ఇబ్బందేమిటీ,’’ అని ఆయన ప్రశ్నించారు.
రైతులకు ఉపయోగపడే ఏ వస్తువును జీఎస్టీ పరిధిలోకి తేవద్దని ఆయన డిమాండ్ చేశారు. 
అమితాబ్ అంటే నాకు గౌరవమని, అయితే  ఆయన జీఎస్టీ ప్రకటన నుంచి తప్పుకోవాలని సూచించారు.
లేకపోతే అమితాబ్ కు రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

 

జగ్గారెడ్డి ఇలా అన్నారు.

 

‘‘గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులను ఆదుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు , జిఎస్‌టి పేరుతో రైతులపై అదనపు పన్నులు వేయడం సహించలేం. రైతుల సంక్షేమం గురించి పట్టించుకోని వారికి రైతులపై పన్నులు వేసే అధికారం ఎక్కడిది?’’

click me!